శ్రీ సిద్ధరామేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి

భిక్కనూరు, బతుకమ్మ : మహిమాన్విత క్షేత్రమైన సిద్ధ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయంలోని మూలభావి వద్ద స్నానాలు ఆచరించి సిద్ధ రామేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు . భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు  ఆలయ ఈవో శ్రీధర్  తెలిపారు. భిక్కనూరు మండలంలోని గురుకుల పాఠశాల ఎన్ సి సి విద్యార్థులు, శ్రీ చైతన్య విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, మండలానికి చెందిన పలువురు...