29.9 C
Hyderabad

భక్తుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : మహాశివరాత్రి సందర్భంగా ఓదేల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడికి గుండెపోటురాగా, పోలీసులు సీపీఆర్ చేసి కాపాడారు. పెద్దపల్లి జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే  భక్తుడు  ఓదేలలోని మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చాడు. ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. అక్కడే ఉన్న పోత్కపల్లి ఎస్సై రమేశ్, పోలీసు సిబ్బంది వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు.

More articles

Latest article