27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉద్యోగ సంఘాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా

Must read

📰 Generate e-Paper Clip

టీఎన్జీవోఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్

కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీవోఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్ లో ఆర్థిక వెసులు బాటు ఉంటుందుని అప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్టు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు ఏర్పడి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. 315 జీవోలో సవరణలు చేయాలని, సీపీఎస్ విధానం రద్దుకు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ ఉన్న బిల్లులను,  5 డీఏలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి , జిల్లా అధ్యక్ష్యులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article