ఉద్యోగ సంఘాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లా
టీఎన్జీవోఎస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ కామారెడ్డి, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీవోఎస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్ లో ఆర్థిక వెసులు బాటు ఉంటుందుని అప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి...