29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పట్టభద్రులు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా

Must read

📰 Generate e-Paper Clip

. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పని చేస్తా

. తెయూకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎంను కోరుతున్నా

. ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: తనను గెలిపిస్తే పట్టభద్రులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియకు ఐదు నెలల ముందు నుంచే తాను ప్రచారం ప్రారంభించానని, ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు, టీచర్లు, ఉద్యోగార్థులు రేవంత్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, సుమారు పదేళ్ల తరువాత తాము బదిలీలు, ప్రమోషన్లకు నోచుకున్నామని టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.  పది రోజుల క్రితమే 2008 డీఎస్సీ నియామకాలు, జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని అన్నారు. అలాగే ఉర్దూ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కళాశాలను అందులోకి షిప్ట్ చేయాలని కోరారు. తనను గెలిపించాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నరేందర్ రెడ్డి అన్నారు.

More articles

Latest article