. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వీధి నాటకాలు వేయడమే వారి పని..
. కేటీఆర్, హరీశ్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి, కిషన్ రెడ్డి ప్లాన్
. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ముస్లిములు బీసీల్లో ఉన్నారు
. . పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: బీజేపీ వాళ్లు వండిన అన్నంలో ఉప్పు వేసే రకాలని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ తన కన్నా బడా బీసీ లేడంటున్నాడు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వీధి నాటకాలు వేయడమే బీజేపి పని అని తాము చేసిన కుల గణనలో తప్పులు ఎక్కడ ఉన్నాయో చూయించి మాటాలడాలని సవాల్ చేశారు. తనకు తెలిసి రాజ్యాంగం ప్రకారం 1960 నుంచి ముస్లిములు బీసీల్లో రిజర్వేషన్లు పొందుతున్నారని పేర్కొన్నారు. గుజరాత్ లో ముస్లింలలోని 29 కులాలు బీసీల్లో ఉన్నారని, మధ్య ప్రదేశ్, మహారాష్ఱ్టలో ముస్లిములు బీసీ రిజర్వేషన్లు పొందుతున్నారన్నారు. కావాలంటే తాను నిజనిర్దారణ కమిటీలను పంపిస్తానని అన్నారు. తామెవరినీ ఎందులో చేర్చలేదని, కులగణన చేపట్టామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీజేపీ, బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యాయని, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విదేశాల నుంచి తీసుకురాకుండా బండి సంజయ్, కిషన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాగే గొర్రెలు, ఈ కార్ స్కాముల్లో తాము కేసులు నమోదు చేస్తే ఈడీ వచ్చి ఫైళ్లను తీసుకెళ్లిందని, కేటీఆర్, హరీశ్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి, కిషన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. మంద కృష్ణ మాదిగను కౌగిలించుకున్న నరేంద్ర మోడీ మాదిగల సమస్యను పరిష్కరించాడా..? సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాడా..? అనేది ఆలోచించాలని కోరారు.

