32.5 C
Hyderabad

పుణ్యసాన్నాలకు వెళ్లి…తిరిగి రాని లోకాలకు

Must read

📰 Generate e-Paper Clip

వారణాసి వద్ద కారును ఢీకొన్న టిప్పర్

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

మృతులు సంగారెడ్డి జిల్లావాసులు

వెబ్ న్యూస్,బతుకమ్మ : కుంభమేళాకు వెళ్లి వస్తుండగా రోడ్డుప్రమాదంలో భార్య భర్తలు, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. ఈఘటన యూపీలోని వారణాసి వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  తెలంగాణలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కుటంబం కారులో కుంభమేళాకు వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో వారణాసి వద్ద కారును టిప్పర్ ఢీకొంది. ఈప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈఘటనలో మృతి చెందిన వారిని ఇరిగేషన్ శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్  డీఈ వెంకట్రాంరెడ్డి(42), భార్య విలాసిని (40), కారు డ్రైవర్ మల్లారెడ్డి గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article