26.6 C
Hyderabad
Monday, August 3, 2026

నిరంతరం పారిశుధ్య నిర్వహణ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: పారిశుధ్య నిర్వహణ పనులను నిరంతరం చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్, వార్డు నంబర్ 12, రామారెడ్డి బైపాస్ ప్రాంతాల్లో కలెక్టర్ శుక్రవారం పర్యటించి మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. ప్రతి ఇంటి నుంచి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బుట్టల్లో వేసేలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. దుకాణ సముదాయల్లోని చెత్తను ప్రతీరోజూ సేకరించాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న నాలాల్లోని చెత్తను తొలగించాలని అన్నారు. పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ వేణుగోపాల్, ఏఈఈ శంకర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article