నిరంతరం పారిశుధ్య నిర్వహణ

కామారెడ్డి, బతుకమ్మ: పారిశుధ్య నిర్వహణ పనులను నిరంతరం చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్, వార్డు నంబర్ 12, రామారెడ్డి బైపాస్ ప్రాంతాల్లో కలెక్టర్ శుక్రవారం పర్యటించి మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. ప్రతి ఇంటి నుంచి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బుట్టల్లో వేసేలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. దుకాణ సముదాయల్లోని చెత్తను ప్రతీరోజూ సేకరించాలని,...