28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒకరికి ఒకరు సహకరించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు సాగినప్పుడే అందరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సేవా తాత్పర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కుల మత లింగ దివ్యాంగ తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం జరగడమే సామాజిక న్యాయమని వారు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవ అధికారుల సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్, స్నేహ సొసైటీ సభ్యులు తాటి వీరేశం, బివి రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం డెన్మార్క్ లో 1995లో చర్చించడం జరిగిందన్నారు. అలాగే 2005 నవంబర్ 26న మరల చర్చించడం జరగగా 2009 ఫిబ్రవరి 20వ తేదీ సామాజిక న్యాయం అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. సామాజిక న్యాయం అనేది ఒకరితో సాధ్యమయ్యేది కాదని ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ఎదుటి వారికి సహాయం చేయాలనే ఆలోచనతోనే సామాజిక న్యాయం అనేది జరుగుతుందని తెలిపారు. ఎదుటివారికి తమకు తోచిన విధంగా నగదురుపైన గాని మాట సహాయంగా నే ఏ రూపకంగా సహాయం అందించిన కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుందని వారు తెలియజేశారు. అనంతరం తాటి వీరేశం గుప్త మాట్లాడుతూ హక్కులు, వారి ఉన్నతి కోసం సామాజిక న్యాయం అంటే పిల్లలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయం అన్నారు. ప్రతి పిల్లవాడికి సమాజంలో సమన్యాయం చేకూరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అనేది చేయించడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రస్తుత తరుణంలో ఆసుపత్రికి హెల్త్ ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ గొప్ప ఆలోచన చేసి నీరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేయడం సంతోషకరమన్నారు. దీనివల్ల ఎంతో పిల్లలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

We should cooperate with each other

దివ్యాంగ పిల్లలుగా జన్మించడానికి చాలా రకాల కారణాలు మన చేతులారా మనమే చేసుకోవడం జరుగుతుందన్నారు. అనవసర మత్తు పదార్థాలు ఇలాంటి తీసుకోవడం, అలాగే ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ఉచితంగా అందించే పౌష్టికాహారం తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల బుద్ధిమాంద్యం మరియు మానసిక ఇతరత్రా వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు.. తల్లిదండ్రులు మూఢనమ్మకాలను విస్మరించినప్పుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి మాట్లాడుతూ సమాజంలో కుల మత వర్గ దివ్యాంగ వివక్షతలు లేకుండా అందర్నీ సమానంగా చూడడం మొదలు పెట్టినప్పుడే సామాజిక న్యాయం అందరికీ చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హక్కుల గురించి మరియు సామాజిక న్యాయం పిల్లలకు పెద్దలకు మహిళలకు ఎలాంటి హక్కులు వర్తిస్తాయో గౌరవ న్యాయస్థానం ఏ విధంగా సహకరిస్తుందో ప్రతి గ్రామాన తెలియపరచడం జరుగుతుందన్నారు.. ప్రతి ఒక్కరు ఒకరికొకరుకు చేదోడు వాదోడుగా ఉంటూ సామాజిక అన్యాయం కోసం పాటుపడాలని సూచించారు.. అనంతరం కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు వికాస్ శకుంతల మరియు ఇతర పిల్లలకు శాలువా జ్ఞాపిక తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తి పద్మావతి, డాక్టర్ ఆకుల విశాల్, నారాయణరెడ్డి రమణారెడ్డి,తాటి వీరేశం, జీవన్ రావు, బాబా గౌడ్, విగ్నేష్ తదితరులను స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి శాలువా జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో  మానసిక వికలాంగుల పాఠశాల  ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సిబ్బంది ఉపాధ్యాయ బృందం పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

We should cooperate with each other

More articles

Latest article