ఒకరికి ఒకరు సహకరించుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు సాగినప్పుడే అందరికీ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సేవా తాత్పర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కుల మత లింగ దివ్యాంగ తారతమ్యాలు లేకుండా అందరికీ సమన్యాయం జరగడమే సామాజిక న్యాయమని వారు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవ అధికారుల...