26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తిట్టాడని వ్యక్తిని కర్రలతో కోట్టి చంపేశారు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్:

తమను కారణం లేకుండా తిట్టిన వ్యక్తిపై  కక్షతో ముగ్గురు వ్యక్తులు కలిసి అతడిని కర్రతో కొట్టి హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామం శనివారం జరిగిన ఘటన అలస్యంగా వెలుగు చూసింది. మద్నూర్ ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం …మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన దానేవార్ సిద్రామ్(45) మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన మీసాలె హన్మంతు, గుంగుబలి రాజు, కల్నూర్ సాయిలు లను  రెండు రోజుల క్రితం తిట్టాడు. మద్యం మత్తులో తిట్టి నాడని మనసులో పెట్టుకొని శనివారం సాయంత్రం సిద్రాం పశువుల కొట్టం వద్ద ఉన్నట్లు గుర్తించి ముగ్గురు వ్యక్తులు అతనితో గోడవ పడ్డారు అక్కడ పశువుల కోట్టంలోని కర్రతో సిద్రాంను కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య దానేవార్ లలిత, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు.

More articles

Latest article