27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

మచ్చర్ల, బతుకమ్మ :  పూలె అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య హాజరై నిర్వాహకులను, రక్తా దాతాలను అభినందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శివాజీ మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడన్నారు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడని తెలిపారు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడడని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కోసారి ఒక్కొక్కరిని తమ వారీగా ప్రచారం చేసుకోవడం మన దేశంలో రాష్ట్రంలో కొత్తేమీ కాదన్నారు. వారిలో ఛత్రపతి శివాజీ  కూడా ఒకరు శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించారని తెలిపారు. అయితే ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదని తెలిపారు. చరిత్రకారుడు సర్దేశాయి ‘న్యూ హిస్టరీ ఆఫ్‌ మరాఠాస్‌’ అనే తన పుస్తకంలో రాశారని తెలిపారు. సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా పేర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో పూలె అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ప్రాణధార బ్లడ్ బ్యాంకు సిబ్బంది, మచ్చర్ల గ్రామ యువకులు పచ్చుక రాములు, రాజు,ప్రసాద్,ప్రసాద్ గౌడ్ జగదీశ్వర్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article