రుద్రూర్, బతుకమ్మ : మరాఠ యోధుడు, హిందూ సామ్రాట్, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించిన ధీరుడు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలను బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. హిందూ సంఘాలు, ఆయా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలు వేసి జయంతి వేడుకలను ఘనంగా అనంతరం గ్రామంలోని ప్రధాన విధుల గుండా ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు మండలంలోని అంబం, రాయకూర్, అక్బర్ నగర్ తో పాటు ఆయా గ్రామాల్లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ మండల కేంద్రంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ సుందరీ కరణ కోసం గ్రామ పెద్దలు విరాళాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఇందురి చంద్ర శేఖర్, హిందూ సంఘాల నాయకులు ప్రశాంత్ గౌడ్,మురళీ, గణేష్, ఇందూర్ కార్తీక్, కటికే రామ్ రాజ్, వడ్ల సాయినాథ్, అనీల్, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

