24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇంపాక్ట్ ఆధ్వర్యంలో ప్రేరణ సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఇంపాక్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన తమ ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, నైతిక విలువలు, మొదలైన అంశాలను వివరించారు. అంతేకాకుండా విద్యార్థులు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని వారి కష్టాన్ని గుర్తించి చదువుకోవాలని జీవితంలో ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల పట్ల విద్యార్థుల బాధ్యతను తెలియజేసి నందుకు విద్యార్థులంతా ఎంతో భావోద్వేగానికి గురైయ్యారు. అనంతరం . చివరగా వక్తలుగా వచ్చిన ఇంపాక్ట్ ప్రతినిధులకు విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున శాలువా పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ శ్రీనివాసరావు, నక్క నవీన్, నరహరి, అనిల్ రెడ్డి, విఠలేశ్వర్, గోపాల్, ఉపాధ్యాయుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

A motivational conference under the auspices of IMPACT

More articles

Latest article