ఇంపాక్ట్ ఆధ్వర్యంలో ప్రేరణ సదస్సు

కోటగిరి, బతుకమ్మ: కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఇంపాక్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన తమ ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జీవితంలో ఎదగడానికి క్రమశిక్షణ, నైతిక విలువలు, మొదలైన అంశాలను వివరించారు. అంతేకాకుండా విద్యార్థులు ఎల్లప్పుడూ తమ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని వారి కష్టాన్ని గుర్తించి చదువుకోవాలని జీవితంలో ఎదగాలని...