24 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి

 

బతుకమ్మ,ముప్కాల్: రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్, రాష్ట్ర కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర రైతు కార్యాచరణ నాయకులు ప్రభాకర్ తో కలిసి ముప్కాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రంలో ఎర్రజొన్న, పసుపు సాగు చేసిన రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని  సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మగ్గిడి ముత్యం రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు గడ్డం చిన్నారెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి చందా రవి, కిసాన్ ఖేత్ అధ్యక్షులు బద్దం సాగర్, టౌన్ అధ్యక్షులు ముస్కు మోహన్, డీసీసీ ఉపాధ్యక్షులు సుంకరి రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు ఏలేటి మల్లారెడ్డి, లోక సుభాష్, ప్రశాంత్ రెడ్డి, అబ్రార్, ముస్కు శ్రీను, పోల ప్రవీణ్, కిషోర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article