26.6 C
Hyderabad
Monday, August 3, 2026

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందను కలిసిన “బార్” న్యాయవాదులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ను నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి  పుష్పగుచ్ఛం ,మెమొంటోను అందజేశారు. జస్టిస్ నంద తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీ సాయిబాబా దర్శనానికి అజంతా  ఎక్స్ ప్రెస్ రైల్లో లో వెళుతూ నిజామాబాద్ రైల్వేస్టేషన్ లో కొద్ది సేపు ఆగిన ఆమెను బార్ ప్రతినిధి బృందం కలిశారు. జస్టిస్ నంద తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యురాలిగా,మధ్యవర్తిత్వం కౌన్సిల్ గా ఎనలేని న్యాయసేవలు అందించారని బార్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సదస్సులలో పాల్గొన్న జ్ఞాపకాలను గుర్తు చేశారు. షిర్డీసాయి ఆధ్యాత్మిక యాత్ర ఫలప్రదం కావాలని బార్ ప్రతినిధి బృందం కోరింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్,చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయ కృష్ణ,మహమ్మద్ షాదుల్లా, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ప్రమోద్,గంగోని శుభం,విష్వక్ సేన్,బాలాజీ,సీనియర్ న్యాయవాది ఆశ నారాయణ పాల్గొన్నారు.

More articles

Latest article