29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చారిత్రక వారసత్వ సంపదలను సంరక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రముఖ వక్త,కవి,చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్

 

బాల్కొండ, బతుకమ్మ : తెలంగాణ వారసత్వ సంబంధలను ప్రభుత్వాలు, ప్రజలు భాద్యతగా పరిరక్షించి, సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ కవి, వక్త, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి ఎక్స్ క్యూటివ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్ బీ. ఆర్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్కొండ ప్రాచీన చరిత్ర అనే అంశం పై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాల్కొండ ఖిల్లా,  బాల్కొండ స్థానిక చరిత్రను అందరికీ తెలియజేయాలనీ, ముక్యంగా విద్యార్థులకు తెలపాలని ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దక్షిణ భారత్ లోనే అత్యంత ప్రాచీనమైన ప్రాంతమని,బాల్కొండ స్వతంత్ర రాజ్యాంగ ఉండేదన్నారు. మల్లయోధులైన అల్లయ్య, కొండయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు అల్లకొండను   పరిపాలించారని .,క్రీ.శ 1059 నుండి అల్లకొండకు ఘనమైన చరిత్ర కలదని తెలిపారు.అల్లకొండ (బాల్కొండ) దాదాపు ఆ కాలంలోనే  39 ఎకరాలకు పైగా విస్తీర్ణంతోనూ, చుట్టూ 9 కొండలతో, కోటకు ప్రధానంగా 6 ప్రవేశ ద్వారాలు, కోట చుట్టూ కందకం, కందకంలో మొసళ్లను పెంచేవారని . అల్లకొండ ను రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, బహుమనీలు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు పాలించారని వివరించారు.మద్రాసు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నత హోదాలో (1780-1836)లో పనిచేసిన ఏనుగుల వీరాస్వామి 1830 లో కాశీ యాత్రలో భాగంగా హైదరాబాద్ పట్టణం నుండి బయలుదేరి ఆర్మూర్ మీదుగా పాదయాత్రగా జూన్ 26 నుండి 29 వరకు  యాత్ర చేస్తూ 3 రోజులు బాల్కొండ లోనే గడిపారన్నారు.ఏనుగుల  వీరాస్వామయ్య రాసిన “యాత్ర చరిత్ర” గ్రంథంలో బాల్కొండ ప్రస్తావన ఉందని కంకణాల ఈ సందర్భంగా విద్యార్థులకు చారిత్రక విషయాలను గుర్తు చేశారు.బాల్కొండ ఖిల్లా గుట్టపై12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయం ఉందని,ముందు గల శిలాశాసనం, పెద్ద పెద్ద బురుజులు, కోటలు, భారీ ఫిరంగి, అశ్వశాల, గజశాల, సైనిక స్థావరాలు, ప్రాచీన కోనేరు, అత్తా కోడళ్ళ బావి, అల్లయ్య, కొండయ్యల శిలా విగ్రహాలు, పరమ శివ భక్తురాలైన సైదానబి సమాధి మున్నగునవి చూడవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాల్కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు భూసం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బొట్ల మధుసూదన్, సంయుక్త కార్యదర్శులు సంతోష్, డి.పవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు వెంకటేష్, అశోక్ ట్రావెల్ బ్లాగ్స్ యూట్యూబ్ సృష్టికర్త బొజ్జ అశోక్ కుమార్, శాంభవి హై స్కూల్, నవీన్ హై స్కూల్, కృష్ణవేణి హై స్కూల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయుడు శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు,   తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article