. కొడుకు కళ్లెదుటే గొంతు నులిమి ఘాతుకం
. ప్రేమికుల రోజు నాడే ఘటన..
ధర్పల్లి, బతుకమ్మ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొడుకు కళ్లెదుటే హత్య చేశాడు. అదీ కన్న కొడుకు చూస్తుండగానే ఆమె గొంతు నులిమి హతమార్చాడు. ప్రేమికుల రోజునాడే ఈ ఘటన చోటు చేసుకుంది. కలకలంరేపిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. జానకంపేట్ కు చెందిన లక్ష్మాపూర్ వినోద్ ధర్పల్లికి చెందిన అనూషను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం రాత్రి వినోద్ తన కొడుకు చూస్తుండగానే అనూష గొంతు నులిమి హత్య చేశాడు. నేను చూస్తుండగానే నాన్న అమ్మను చంపేశాడని వారి కొడుకు స్థానికులు తెలిపాడు. అనూషను హత్య చేసిన వినోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రేమికుల రోజునాడే ఈ ఘటన చోటు చేసుకుంది.
