24 C
Hyderabad
Sunday, August 2, 2026

పాఠశాల గ్రంథాలయానికి పుస్తక వితరణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల : జాతీయ పుస్తక వితరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి  తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ పుస్తకాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కృష్ణాచారి మాట్లాడుతూ పుస్తకాలను చదవడం వల్ల మంచి జ్ఞానం లభిస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాఠశాల గ్రంధాలయాన్ని వినియోగించుకొని చక్కగా పుస్తకాలను చదవాలని తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందజేసిన ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ ను అభినందించారు. విద్యార్థుల లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకి తీయాలంటే పుస్తకజ్ఞానం తప్పకుండా అవసరమని అందుకే పుస్తకాలను వితరణ చేశానని ప్రవీణ్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజశేఖర్, పవన్, ప్రసాద్, రాజ నరసయ్య, రాజేందర్, విజయ్, శ్రీనివాస్, గంగాధర్, గంగా మోహన్, ట్వింకిల్,నరేష్ సబిత పాల్గొన్నారు.

More articles

Latest article