29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

తల్లిదండ్రుల ఆరాధన దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూరు, బతుకమ్మ : ఆర్మూరు పట్టణ కేంద్రం లోని టీచర్స్ కాలనీలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఆరాధన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలను విని బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  తల్లిదండ్రులకు సరైనటువంటి గౌరవాన్ని ఇస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని ,తల్లిదండ్రుల పట్ల మంచి భావనతో, గౌరవంతో వారు అనుకునే ఆశయాన్ని నెరవేర్చే దిశగా పయనం ఉండాలని తెలిపారు. సమాజంలో అనాధాశ్రమాలలో ఎంతోమంది వృద్ధులను చేర్చడం జరుగుతుందని ,అలాంటి దౌర్భాగ్యస్థితి మునుముందు రాకుండా తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. శిశు మందిరాల్లో మాత్రమే తల్లిదండ్రుల యొక్క విలువల్ని తెలుపుతూ మన ఆచారాలను తెలిపే విధివిధానాలు దొరుకుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్, మాతాజీ లో విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

More articles

Latest article