29 C
Hyderabad
Monday, August 3, 2026

మాఘ పూర్ణిమ సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ కావడంతో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే త్రివేణి సంగమం, ఇతర ఘాట్ ల వద్ద దాదాపు 1.60 కోట్ల మందికి  పైగా భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు కుంభ్ మేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు.

More articles

Latest article