వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో బుధవారం మాఘ పూర్ణిమ కావడంతో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకే త్రివేణి సంగమం, ఇతర ఘాట్ ల వద్ద దాదాపు 1.60 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు కుంభ్ మేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు.