24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 100 నామినేషన్ లు

Must read

📰 Generate e-Paper Clip

  • . . . టిచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 నామినేషన్ లు
  • . . . ముగిసిన నామినేషన్ ల పర్వం

 కరీంనగర్, బతుకమ్మ  :

 

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి 100 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.  చివరి రోజు సోమవారం 51 నామినేషన్ లు దాఖలు అయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు 8 నామినేషన్ లు దాఖలు కాగా మొత్తం 17 నామినేషన్ లు  వచ్చాయని తెలిపారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్ ల ఉపసంహరణ అవకాశం ఉంది. ఈ నెల 27న పోలీంగ్, మార్చి 3న ఫలితాలు వెలువడుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు బిఆర్ఎస్ దూరం కాగా బిజేపి, కాంగ్రెస్ పార్టీలు పోటిపడుతున్నాయి. స్వతంత్రులు ఎక్కువగా నామినేషన్ లు దాఖలు చేయడంతో పోటి రసవత్తరంగా మారుతోంది.

More articles

Latest article