29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సమస్యలు పరిష్కరించాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : విద్యాశాఖలో ఉన్న పలు రకాల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు శనివారం ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఉన్నత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయులు మాణిక్యం సస్పెన్సన్ వెంటనే ఎత్తివేయాలని, అలాగే  మధ్యాహ్నం భోజనం లో భాగంగా ప్రధానోపాధ్యాయులకు బాధ్యత లను తప్పించాలని డిమాండ్ చేశారు. కుల గణ చేసిన  ఉపాధ్యాయులకు త్వరగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరారు. ఎంఈఓ లకు తెలియకుండా ఏసీజీఈ, సీఎస్  లు నవోదయ, ఓపెన్ టెన్త్, ఇతర పోటీ పరీక్షలలోఇన్విజిలేటర్లను సొంత మండలంలో ఉన్న ఉపాధ్యాయులను కాకుండా వేరే మండలంలో ఉన్న ఉపాధ్యాయులను  ఇన్విజిలేటర్లుగా డ్యూటీ లు వేసుకుంటున్నారు.. ఇన్విజిలేషన్ విధులలో పారదర్శకత ఉండాలన్నారు. ఏఏపీసీ పనులు పూర్తి ఐనను చాలా మండలాలలో ఇంజనీరింగ్ అధికారులు ఎంబీ రికార్డు చేయుటలో జాప్యం -బిల్లులు చెల్లించాలన్నారు. ఎస్సస్సీ పరీక్షలలో ఇన్విజిలేషన్ డ్యూటీలు పారదర్శకంగా వేయాలన్నారు. స్థానిక ఎన్నికలలో కొన్ని ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులకు ఎన్నికల డ్యూటీలు వేయరు కాని రిటైరమెంట్ కు దగ్గర ఉన్న టీచర్స్ కి, పీహెచ్సీ టీచర్స్ కి, క్యారింగ్ మహిళా ఉపాధ్యాయినులకు ఎన్నికలలో విధులు అప్పగిస్తున్నారని దీనిని నియంత్రించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో కో చైర్మన్ హన్మంత్ రెడ్డి, కుంట రాములు, కోశాకారి పందిరి రాజేష్, సంయుక్త కార్యదర్శిలు అయ్యాల సంతోష్, ఘఫుర్ శిక్షక్, ముజిబుద్దిన్, ప్రభాకర్,గోపాల్, రాములు, స్వామి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Request to solve problems

More articles

Latest article