రుద్రూర్, బతుకమ్మ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో గల అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునఃరుద్దరీకరణ పనులలో భాగంగా ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన శ్రీధర్ గౌడ్, సంతోష్ గౌడ్ వారి మాతృమూర్తి బాలమణి జ్ఞాపకార్థం శనివారం రోజున ఆలయ కమిటీ నిర్వాహకులకు 5 వేల రూపాయలు విరాళం అందజేశారు. ఆలయాల అభివృద్ధి కొరకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, ఆలయ కమిటీ సభ్యులు కటికె రామ్ రాజ్, జాలోజి తదితరులు పాల్గొన్నారు.
