28.2 C
Hyderabad

ఇంటి నుంచి తెచ్చారా.. నో

Must read

📰 Generate e-Paper Clip

  • గేటు ముందు కొన్నారా.. ఓకే
  • అమ్మకందారులతో కుమ్మక్కు
  • గురుకుల పాఠశాలల పరిస్థితి ఇది

ఇందూర్, బతుకమ్మ:  ఇంట్లో వండుకొని తెచ్చిన ఆహార పదార్థాలను లోనికి అనుమతించట్లేదు గాని గేటు ముందర విక్రయించే వాటిని కొన్న ఐస్ క్రీమ్ లకు అడ్డు చెప్పట్లేదు. కంజర గురుకుల బాలికల పాఠశాల ఎదుట జరుగుతున్న వ్యవహారమిది. గురుకుల పాఠశాలలోకి బయటి పదార్థాలను తీసుకురావద్దని, ఇంటి నుంచి  ఎలాంటి ఆహారం చికెన్, మటన్, ఇతర వాటిని తేవద్దని గురుకుల కార్యదర్శి  ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు  కార్యదర్శి ఆదేశాలను పాటించడం లేదు. ఇంటి నుంచి ఆహారం తీసుకురావద్దని చెప్పిన తల్లిదండ్రులకు,

Did you bring it from home? No

గురుకుల పాఠశాలకు వెళ్లిన తర్వాత ప్రతి నెల రెండవ శనివారం గేటు బయట ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఇతర శీతల పానీయాలు, తినుబండారాలు లభిస్తున్నాయి. వీటిని కొని పిల్లలకు ఇస్తే అభ్యంతరాలు తెలపడం లేదు. ఇంటి ఆహారాన్ని లోపలికి పంపడం లేదు. అమ్మకందారులతో పాఠశాల వారు కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు తల్లి, దండ్రులలో వస్తోంది. సంబదిత పాఠశాలల ప్రిన్సిపల్స్ పట్టించుకోకపోవడంతోనే గేటు బయట విక్రయించే ఆహారాలు   లోపలికి వస్తున్నాయి. ఇంటి ఆహారం తింటే  అనారోగ్యం పాలైతే, గేటు ముందట కొన్న పదార్థాలు తింటే  ఆరోగ్యంగా ఉంటారేమో… అందుకే ప్రతి రెండవ శనివారం  గేటు ఎదుట సంతలా వెలసిన దుకాణాలను తీసివేయించలేక పోతున్నారు.

Did you bring it from home? No

More articles

Latest article