డిల్లీ, బతుకమ్మ : డిల్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవీల్ పేర్కొన్నారు. ఈమేరకు బీజేపీకి ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను పార్టీ నెరవేరుస్తుందని వ్యాఖ్యనించారు. అలాగే డిల్లీ సీఎం అతిశీ స్పందిస్తూ.. బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వ్యాఖ్యలు చేశారు. డిల్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఆప్ పార్టీ 18 స్థానాల్లో గెలిచి.. 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ప్రజాతీర్పును అంగీకరిస్తున్నా: కేజ్రీవాల్
