26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కెమిస్ట్రీ విభాగంలో పి.పద్మకు డాక్టరేట్ ప్రదానం

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి పి.పద్మకు డాక్టర్ వాసం చంద్రశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ప్రిపరేషన్”డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ సమ్ న్యూ మైక్రో నానో స్ట్రక్చర్ ఇనార్గానిక్ మెటీరియల్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ కాటలిసిస్.”   అనే అంశంపై పరిశోధన జరిపారు. గురువారం నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ  ప్రొఫెసర్ వి.రవీందర్   హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని  సమగ్రంగా అమూల్యాంకనం చేశారు.  పరిశోధక విద్యార్థి పద్మ ఇనార్గానిక్ ట్రాన్సిసిషన్ మెటల్స్ నానో పార్టికల్స్ నీ కాటలిస్ట్ గా ఉపయోగించడం వల్ల దేశానికి జరిగే ప్రయోజనాలను ఈ సిద్ధాంత గ్రంథంలో తెలిపారు. ఆచార్య వి.రవీందర్ సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. ఈ పరిశోధన కోసం జరిగిన ప్రయోగంలో రుజువైన ఫలితాలతో  రాసిన  మూడు వ్యాసాలు  ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ ప్రమాణాలున్న  అత్యధిక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ కలిగిన  జర్నల్స్  ప్రచురించడం  ఈ పరిశోధనకు మరింత  గుర్తింపు వస్తుందని ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్ బి రవీందర్ పరిశోధకురాలును అభినందించారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఫార్మసిటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ బోయపాటి శిరీష,  డాక్టర్ ప్రసన్న శీల  కాంటాక్ట్ అధ్యాపకులు  పరిశోధక విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.

More articles

Latest article