27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వేసవిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా నిజాంబాద్ పవర్ హౌస్ లోని సబ్ స్టేషన్ లో రెండు ఎయిట్ ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని ఎస్ సి రాపల్లి రవీందర్ తెలిపారు. దాంట్లో ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ నుండి 12 పాయింట్ ఫైవ్ చేయడం జరిగిందన్నారు. నిజాంబాద్ పట్టణ ప్రజలకు ఒక సబ్ స్టేషన్ లో అంతరాయం ఏర్పడితే మరొక సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అందజేయడానికి 12 పాయింట్ ఫైవ్ ట్రాన్స్ఫార్మర్ అమర్చడం జరిగిందని తెలిపారు. టీజీ ఎంపీడీసీఎల్ సిఎండి కె వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో గాజుల్పేట్, బర్కత్ పుర, సాయి నగర్ ,సీతారాం నగర్, కాలనీ ఆనంద నగర్ ,శివాజీ నగర్, నాల్కల్ రోడ్, నాగారం, 80 కోటర్స్, ధరంపురి హిల్స్, మాలపల్లి, బోధన్ రోడ్, కిల్లా రోడ్, దారు గల్లి, శంభుని గుడి, హెడ్ పోస్ట్ ఆఫీస్ ,ముజాత్ నగర్, ఆల్ ఇండియా రేడియో, గాయత్రి నగర్ సాయి నగర్, రేణుక నగర్, సూర్య నగర్, ఇంద్రాపూర్ డ్రైవర్స్ కాలనీ పూజారి కాలనీ, 300 కోటర్స్, నీరు  కొండ హనుమాన్ టెంపుల్ ఆర్ జి జి వై కోటర్స్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. డి ఈ ఆపరేషన్ ఎం శ్రీనివాసరావు, డిఈఎం ఆర్.టి వెంకటరమణ, ఏడిఈ ఆపరేషన్ ఆర్ చంద్రశేఖర్, వీరేశం, ఏ డి ఈ ఎస్ పి ఎం కె  నటరాజ్, ఏడిఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏఈ ఆపరేషన్ పవర్ హౌస్ నగేష్, ఏఈ ప్రొటెక్షన్ భాస్కర్ ప్రసాద్ ,ఏ ఈ టి ఆర్ ఇ సాయిలు, ఎంఆర్టి ఫోర్ మెన్ మక్సుస్, ఎమ్మార్టీ సిబ్బంది ఆపరేషన్ సిబ్బంది పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో పాల్పంచుకున్నారు.

More articles

Latest article