29 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్లకు గద్దర్ పేరు పెట్టి ఇంటికో తుపాకి ఇవ్వండి

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గద్దర్ పై కాంగ్రెస్ పార్టీకి, సీయం రేంవత్ రెడ్డికి ప్రేమ ఉంటే సీయం ఆఫీస్ కు, గాంధీ భవన్ కు పేరు పెట్టాలని ప్రభుత్వం ఇస్తానన్న ఇందిరమ్మ ఇండ్లకు గద్దర్ పేరు పెట్టి ఇంటికో తుపాకి ఇవ్వండని బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేష్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశంలో కాసం వెంకటేష్ మాట్లాడుతు … సీయం రేవంత్ రెడ్డి గధ్దర్ 77 వ జయంతి సందర్బంగా బిజేపి కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామనడాన్ని ఖండించారు. గద్దర్ పై 21 కేసులు పెట్టిందెవరు అని ప్రశ్నించారు. గద్దర్ ఒక్కరే తెలంగాణ కోసం పోరాడలేదని చిన్న పిల్లాడినుంచి పండు ముదుసలి వరకు అందరు పోరాడారని గుర్తు చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ ను జీవితాంతం కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపించారు. గద్దర్ పై రాజద్రోహం కేసు, ఉపా కేసు పెట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ జాగీర్ కాదని ఆపార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం బీజేపీ వెంటాడుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కాలం చెల్లిందని భవిష్యత్తు అంతా బీజేపీ పార్టీదేనని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కులాచారీ దినేష్, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు.

Name Gaddar to Indiramma's houses and give a gun to each house

More articles

Latest article