27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

తనయుడి మృతికి కారణమైన తల్లికి పదేళ్ళ కఠిన జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ : ఆరు సంవత్సరాల కన్న కొడుకును నీళ్లలో ముంచి,గొంతుపిసికి ఊపిరి అడకుండజేసి ఊపిరి తీసిన కన్నతల్లికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.శ్రీనివాస్ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు  నిజామాబాద్ నగరంలోని నాగారం సంతోష్ నగర్ నివాసుడైన గడ్డం భరత్ కు సదాశివ నగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన లావణ్య ఆలియాస్ మమత పెళ్లి అయి ఇద్దరు కుమారులు జన్మించారు. చిన్న కొడుకు రణదీప్ తొమ్మిది నెలల కాలంలోనే కన్ను మూశాడు. కొన్ని రోజులు కామారెడ్డిలో బతికిన వారు తిరిగి సంతోష్ నగర్ కు వచ్చారు.లావణ్య కు పెళ్లి కంటే ముందు కల్లు త్రాగే అలవాటు ఉంది.కల్లు కు ఆమె వ్యసనపరురాలైంది.ప్రతి రోజు రెండు,మూడు కళ్ళు సీసాలు త్రాగండి ఉండేదికాదు. కల్లు కోసం భర్త భరత్ ను బాధలకు గురిచేసి తెప్పించుకునేది.లావణ్య తాగుడు చూసిన భర్త బందువులు తాగుడు మానమని కోరిన వినేదికాదు. కల్లు తాగుడు వద్దని చెప్పిన భర్త పైనఎటువెళ్తే అటు తనతోపాటు వస్తున్న పెద్ద కుమారుడు రోహిత్ పైన కసి పెంచుకుని భర్త ఒకరోజు రాత్రి సమయంలో కడుపు పై బ్లెడ్ తో కోసింది. 28మార్చి 2023న కొడుకును వెంటబెట్టుకుని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రాత్రి పడుకుని 29వ తేదీన పొద్దున లేచి మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ దగ్గర్లో గల నిజాంసాగర్ కెనాల్ వద్దకు వెళ్లి కెనాల్ నీళ్లల్లో ఆరు సంవత్సరాల కొడుకుని ముంచిగొంతుపిసికి చంపివేసిందనే నేరారోపణలు, కోర్టు నేర న్యాయ విచారణలో రుజువులైనట్లు నిర్ధారిస్తు జడ్జి శ్రీనివాస్   కొడుకు మృతి చెందడానికి కారణమైనందున పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యేడల అదనంగా నెల రోజుల జైలుశిక్ష అనుభవించాలని తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

More articles

Latest article