27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ కార్యవర్గ సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాలతో జిల్లా లో రెడ్ క్రాస్ కార్యాలయంలో గురువారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే పాఠశాల, జూనియర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ఆర్ సి ఓతో జూనియర్ రెడ్ క్రోస్ క్లబ్ లు ఏర్పాటుచేయాలని, జె ఆర్ సి ద్వారా పిల్లలకు చిన్నప్పటి నుండే సేవా భావం, సేవా కార్యక్రమాలు అలవాటు చెయ్యాలని, పరిశుభ్రత పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమం లో తోట రాజశేఖర్, జె ఆర్ సి కోర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవి ,జిల్లా సెక్రటరీ అరుణ్ బాబు, ఆర్సిఓ, ప్రిన్సిపాల్లు, పిఆర్ఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article