27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

420 హామీలు.. 420 రోజులు..

Must read

📰 Generate e-Paper Clip

  • అటకెక్కిన ఆరు గ్యారెం టీలు.. భరోసా లేని రైతు భరోసా..
  • అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం
  • నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు హామీ ఇచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి.. 420 రోజులైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 6 గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని, 2021 లోనే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీ బట్టి విక్రమార్క పాల్గొన్నారని తెలిపారు. కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదాయ పరిమితిని సడలించారని అన్నారు.

420 guarantees.. 420 days..

గ్రామీణంలో 60 వేలు నుంచి 1.50 లక్షలకు,  పట్టణంలో 75 వేలు నుంచి 2.50 లక్షలకు పెంచారని అన్నారు. మేనిఫెస్టోలో తాము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యంను 4కేజీల నుంచి 6కేజీలకు పెంచామని గుర్తుచేశారు. కుటుంబానికి 20 కేజీలు ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కేజీలు ఇచ్చామని తెలిపారు. 2.5 ఎకరాలు ఉన్న మాగాణి భూమిని 3.5 ఎకరాలకు పెంచామని తెలిపారు. 5 ఎకరాలు ఉన్న చెలక భూమిని 7.5 ఎకరాలకు పెంచామన్నారు.  తమ ప్రభుత్వంలో 6,47,479 నూతన రేషన్ కార్డులు జారీ చేశామన్నారు. రేషన్ కార్డులు జారీ కూడా ఏదో చారిత్రాత్మక కార్యక్రమమని ఎన్నడూ చెప్పుకోలేదని తెలిపారు. కానీ  రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావదారిద్య్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బాండ్ పేపర్లు, అఫిడవిట్లు ఇచ్చి మరి ప్రజలను మోసగించారని.. గోబెల్ సిగ్గుపడేలా అబద్దాలను ప్రచారం చేశారని విమర్శించారు. తెలంగాణ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ మొహం చాటేసారన్నారు.

420 guarantees.. 420 days..

ఇక్కడున్న రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇవ్వండని అడిగిన నిరుద్యోగులను తీవ్రంగా  కొట్టి జైల్లో వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 420 రోజులు దాటుతున్న నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కేసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికెషన్స్ ని, కోట్ల ప్రజా ధనంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్దాలు  పలికి ఇప్పటి వరకు వారికీ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదని, మోసపోయిన ప్రజల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకు కొందరికి మాత్రమే రుణ మాఫీ చేశారని తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా లాక్ డౌన్, నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని మా  కెసిఆర్ 28,275 కోట్ల రుణమాఫీ చేసిండని తెలిపారు. రైతు భరోసాకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు అని ఇప్పుడు  రైతు భరోసా 12 వేలు అంటూ ఒకసారి సంక్రాంతి, మరోసారి జనవరి 26 కు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ మార్చి 31 కి అంటున్నారని అన్నారు. రైతు కూలీలకు 12 వేలు అన్నది భూటకం అని తెలిపారు. అప్పుడు రైతు బంధు 10 వేలు బిక్షం అన్న రేవంత్ రెడ్డి 420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదని అన్నారు. రైతు బందు సంవత్సరానికి రెండు విడుతలుగా క్రమం తప్పకుండ ఎకరాకు 10 వేల చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత మా కెసిఆర్ ప్రభుత్వానిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు సిర్ప రాజు, సత్యప్రకాశ్, దండు శేఖర్, నవీద్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

420 guarantees.. 420 days..

More articles

Latest article