- జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రాథమిక స్థాయి విద్యార్థి దశ నుండి కళాశాల స్థాయి విద్యార్థులు అందరు అపార్ నమోదు చేయించుకోవాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం హాల్ లో మంగళవారం అపార్ నమోదు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీధర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల స్థాయిలో హెడ్ మాస్టర్ లు, ప్రిన్సిపాల్ లు అందరు వెంటనే విద్యార్థుల వివరాలు యుడైస్ ద్వారా వన్ నేషన్ వన్ స్టూడెంట్ 12 డిజిట్ గుర్తింపు నంబర్ పొందాలని అన్నారు. ప్రతి విద్యార్థి తన కెరీర్ ను అభివృద్ది, ఉద్యోగం పొందేందుకు అపార్ అవసరమని అన్నారు.ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా పాఠశాల విద్య అధికారి అశోక్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవన్, జిల్లా ప్రభుత్వ కళాశాలల సీనియర్ ప్రిన్సిపాల్ రజీయుద్ధిన్ అస్లమ్, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

