బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 10వ డివిజన్ లో గల సీనియర్ సిటిజన్ ఫోరం, యూత్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణకు చేశారు. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.డి.అన్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.డి అన్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతాలకతీతంగా అందరూ ఏకతాటిపైకి ఉండి సమాజం సమ సమాజ నిర్మాణం కోసం కలలతో రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. ఇప్పుడున్న కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటామని ఆయన అన్నారు. అందరు కూడా కుల మతాలకతీతంగా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలని బాబాసాహెబ్ ఆశయాలను అనుసరించి ఆయన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు ఎం.డి గఫూర్, 10వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే రషీద్, సైఫుద్దీన్, ఎస్కే మహబూబ్, పతాఖాన్, సుధా, బాలకృష్ణ, పెంటయ్య, కుమార్, 10వ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
