సీనియర్ సిటిజన్ ఫోరం, యూత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 10వ డివిజన్ లో గల సీనియర్ సిటిజన్ ఫోరం, యూత్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాక ఆవిష్కరణకు చేశారు. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎం.డి.అన్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.డి అన్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతాలకతీతంగా అందరూ ఏకతాటిపైకి ఉండి సమాజం సమ సమాజ నిర్మాణం కోసం కలలతో రాజ్యాంగాన్ని రాశారని తెలిపారు. ఇప్పుడున్న కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని...