- బీఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్
కామారెడ్డి సిటీ, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిఎస్పి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. జన కళ్యాణ్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి పోటీ చేసి గెలిచే విధంగా దిశానిర్దేశం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది మహానీయుల యొక్క సిద్ధాంతాలపై నిర్మించబడిన పార్టీ, రాజ్యాంగాన్ని రక్షింఛే పార్టీ, రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసే ఒకే ఒక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ఎస్సి, ఎస్టి, బిసి, మత మైనార్టీ, అగ్ర వర్ణాల్లో పేదలకు,మహిళలందరికీ సమానంగా చూసే ఏకైక పార్టీ అని అన్నారు. రాష్ట్ర కోఆర్డినేటర్ విశిష్ట అతిథిగా నీరడీ ఈశ్వర్, రాష్ట్ర ఈసీ గైనీ గంగాధర్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ఇంచార్జ్ అడ్వకేట్ జగన్,లక్ష్మి యాదవ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్, కోకొండ రాజేందర్, దుంపల సురేష్, సిద్ధిరాములు, బెంమ్రి భాస్కర్, బాబు, ఈభత్వార్ రోహిదాస్, నత్తి జీవన్, దుబ్బాక నవీన్, మర్లు సాయి బాబా, మల్లె కరుణ,తదితరులు పాల్గొన్నారు.