24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని నిరాహార దీక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలేనిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా టీవీఏసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తాము గత 18ఏళ్లుగా కాంట్రాక్టు  కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2016లో ఉద్యమం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి 2017లో తమని విలీనం చేస్తూ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయమై 2018లో కోర్టును ఆశ్రయిస్తే కాంట్రాక్టు కార్మికులను ఇండస్ట్రీయల్ డిస్ఫ్యూట్ యాక్ట్ ప్రకారం పర్మినెంట్ చేసుకునే వెసులు బాటు విద్యుత్ సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి  కల్పిస్తూ తీర్పు వెలువరించిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల లెక్కలలో అసెంబ్లీలో కూడా విద్యుత్ సంస్థలో 23,667 మందిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. విద్యుత్ సంస్థ యాజమాన్యం పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయకుండా మొదటి ఆర్డర్ రద్దు చేసి కొత్తగా ఫ్యాక్టరీ చట్టం 1946 స్టాండింగ్ ఆర్ఢర్ సర్వీస్ రూల్స్ తెరపైకి తెచ్చి తమని పర్మినెంట్ చేయకుండా నేరుగా వేతనాలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.  ఇకనైనా తమని రెగ్యులర్ చేసి ఆదుకోవాలని కోరారు.

More articles

Latest article