27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పరిస్థితులకు అనుగుణంగా విప్లవోద్యమాలు నిర్మించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఏఐయుకెఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్

 

మాక్లూర్, బతుకమ్మ : ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నూతన విప్లవొద్యామాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐయు కెఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్ అన్నారు. సోమవారం
ఏఐకెఎంఎస్ నుండి పలువురు కీలక నేతలు ఏఐయుకెఎస్ ,ఏఐపీకెఎంఎస్ లో చేరికల సందర్బంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అఖిలభారత రైతు కూలి సంఘం (ఏఐకెఎంఎస్) నుండి పలువురు కీలక నేతలు అఖిలభారత యునైటెడ్ రైతు సంఘం( ఏఐయుకెఎస్), అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకెఎంఎస్) లో చేరారు.  ఏ.ఐ.యు.కె.ఎస్. రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి.ప్రభాకర్, ఏ.ఐ.కె.ఎం.ఎస్ రాష్ట్రా ప్రధానకార్యదర్శి పి.రామకృష్ణల సమక్షంలో అఖిలభారత రైతు కూలి సంఘం (ఏ.ఐ.కె.ఎం.ఎస్) జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్, మండల ప్రధానకార్యదర్శి శంకర్ గౌడ్ ల ఆధ్వర్యంలో పలువురు కీలకనేతలు చేరారు. ఈ సందర్బంగా దేశంలోసరియైన పంథాలో ప్రజా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రజలు పలు విప్లవ సంఘాల శ్రేణులు ఆలోచిస్తున్నాయని, అందులో భాగంగానే న్యూడేమోక్రసి కి చెందిన అఖిలభారత రైతుకూలీ సంఘం(ఏ.ఐ.కె.ఎం.ఎస్ ) నుండి సిపిఐ(ఎం.ఎల్ ) మాస్ లైన్ అనుబంధ సంస్థల్లో చెరెందుకు సంసిద్దత వ్యక్తం చేస్తున్నారని అన్నారు.ప్రజా సమస్యల పట్ల సరియైన పద్ధతిలో పోరాటంలో నిర్మించడంలో విఫలమైనందునే ఎన్. డి సంఘాల నుండి చేరారన్నారు . ఉచ్చారణకు ఆచరణకు పొంతన లేకపోవడం వల్లనే న్యూడేమోక్రసి రైతుకూలీ సంఘమును వీడి మాస్ లైన్ రైతు, కూలీ సంఘాల్లో చేరారన్నారు. నూతనంగా చెరిన నేతలను అభినందిస్తున్నామని తమ ప్రాంతాల్లో బలమైన విప్లవోధ్యమా నిర్మాణంకు పునుకోవాలి అని వారు కోరారు. చేరినవారు ఏ. ఐ. కె. ఎం. ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ గౌడ్, మాక్లూర్ మండల కార్యదర్శి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు టి.నాగేష్, మండల నాయకులు మారుతీ, నితిన్, శ్రీనివాస్, అన్వేష్,కిసాన్ లతో పాటు 10 మంది ముఖ్య నాయకులు చేరిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత యునైటెడ్ రైతు సంఘం( ఏ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. దేవరాం,జిల్లా ప్రధానకార్యదర్శి గుమ్ముల. గంగాధర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏ.ఐ.యు.కె.ఎస్.) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.గంగాధర్, ఏ.ఐ.యు.కె.ఎస్., ఏ.ఐపి. కె.ఎం.ఎస్ జిల్లా మండల నాయకులు బి.బాబన్న, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article