29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రిటైర్మెంట్ వయసు పెంపు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు

Must read

📰 Generate e-Paper Clip

  • తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలి 
  • టీఎస్ యుటీఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ 

 

భీమ్ గల్, బతుకమ్మ : పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలనే ప్రభుత్వ యోచన సరైంది కాదని, ఆ ప్రతిపాదన విరమించుకుని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి సంఘాలతో చర్చించి 1.07.2023 నుండి అమలు చేయాలని, బకాయి పడిన నాలుగు వాయిదాల కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెజిబివి, యుఆర్ఎస్, ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేలు ఇవ్వాలని, గురుకులాల పనివేళలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూలంగా మార్చాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్ లో విద్యకు 15% కేటాయించాలని, విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులపై అరాచక శక్తుల దాడులు అరికట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిడిపిలో 6% విద్యకు కేటాయించాలని కోరారు. ఎన్ఈపి 2020ని రద్దు చేయాలని, జాతీయ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పాత విధానంలో 8 లక్షలకు పెంచాలని, పొదుపు మొత్తాలపై రాయితీని 5 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని జనార్దన్ డిమాండు చేశారు.

More articles

Latest article