రిటైర్మెంట్ వయసు పెంపు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు
తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలి టీఎస్ యుటీఎఫ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ భీమ్ గల్, బతుకమ్మ : పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలనే ప్రభుత్వ యోచన సరైంది కాదని, ఆ ప్రతిపాదన విరమించుకుని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను...