నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించారు. 35వ డివిజన్ శివాజీ విగ్రహం జైన్ మందిర్, 36వ డివిజన్ చత్రపతి హనుమాన్ మందిర్ వద్ద ,37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ ఎస్సీ సంఘం వద్ద, 43 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 14వ ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్ కు పదిలక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు వంద కోట్లు మంజూరు చేయాలనీ ఇంచార్జ్ మంత్రి జూపల్లి, ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, కార్పొరేటర్లు 35 వ డివిజన్ ఎర్రం సుధీర్, 36 వ డివిజన్ మాస్టర్ శంకర్,37 వ డివిజన్ ఉమా రాణి,ముత్యాలు, 43 వ డివిజన్ స్రవంతి రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

