- సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్
ధర్పల్లి, బతుకమ్మ : ధర్పల్లి మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసి రెడీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని సీపీఐ (ఎం. ఎల్ ) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి అయిపోయిన డబుల్ బెడ్ రూమ్ లాను ఆర్హులకు ఇవ్వాలని కోరుతూ లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకవేళ డబుల్ బెడ్ రూంలు అర్హులకు కేటాయించకపోతే లబ్ది దారులచే ఆక్రమిస్తామని స్పష్టం చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూములను అట్టహాసంగా ప్రారంభించి పేదవాడి కళ నెరవేరుస్తామని డబ్బా కొట్టుకుని ప్రచారం చేసుకున్న పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అందులో భాగంగా ధర్పల్లి మండల కేంద్రంలో పేదప్రజలకు అందించడానికి లక్షల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేపట్టిన,నిరుపేదల కల కలగానే మిగిలిందన్నారు. దీనివల్ల డబుల్ బెడ్ రూములు నిర్మించిన కూడా నిరుపయోగంగా మిగిలిపోయాయాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో చొరవ చూపి, మానవతా దృక్పథంతో ఆలోచించి నిరుపేదలైన లబ్ధిదారులకు అందేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు స్వరూప,లక్ష్మి, తారు,గంగామణి, తదితరులు పాల్గొన్నారు.
