28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

 భీంగల్ సిఐ కమీషనరేట్ కు అటాచ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ఎపెక్ట్

. . .  భీంగల్ సీ ఐ,ఎస్సైల పై విచారణకు జరిపించిన ఇంచార్జ్ సీ. పీ

. . .  మల్టీ జోన్ 1 ఐజీకి రిపోర్టు

. . . ఎస్సై పై వేటు ఖాయం

భీమ్ గల్, బతుకమ్మ :

 

భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే జరిగిన వరుస సంఘటనల నేపథ్యంలో భీమ్ గల్ సీ.ఐ పై ఉన్నతాధికారులు  చర్యలకు ఉపక్రమించారు. భార్య, భర్తల అదనపు కట్నం కేసులో బాధితుడి సెల్ఫీ వీడియో రిలీజ్, ఇద్దరు భార్య ఉన్న ఓ నాయకుడు తనపై తన కొడుకు, అల్లుడు దాడికి సీ. ఐ స్వయంగా డబ్బులు తీసుకొని ఉసిగొలపారన్నా ఆరోపణల నేపథ్యం లో  ’బతుకమ్మ ‘ దిన పత్రిక లో గత కోన్ని రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్ పోలీస్  కమీషనర్ సింధూ శర్మ విచారణ జరిపించారు. అందులో భాగంగా ముందుగా భీంగల్ సీ. ఐ నవీన్ ను హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. సంబందిత విచారణ నివేధికను మల్టీ జోన్ 1 ఐజికి రిపోర్టు చేశారు. ఐజీ సిఐపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భీంగల్ సీ ఐ నవీన్, ఎస్సై మహేష్ ల పై వచ్చిన అవినీతి ఆక్రమాల విచారణ అనంతరం ఎస్సై పై కూడా వేటు పడటం ఖాయమైంది.

More articles

Latest article