బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువైన కాకతీయ కాలువ ద్వారా 2135 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. అలాగే వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1086.40 అడుగులు, 64.402 టీఎంసీల నీరు నిలువ ఉంది.
