26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బీజేపీ మండల అధ్యక్షుల ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : బీజేపీ రాష్ట్ర నాయకుల ఆదేశానుసారం బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాలోని 21 మండలాలకు శుక్రవారం నూతన అధ్యక్షులను ఎన్నుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఖిల్లా రాంమందిర్ అధ్యక్షునిగా కోడురు నాగరాజు, వినాయక్ నగర్ అధ్యక్షునిగా ఇప్పకాయల కిశోర్, కంఠేశ్వర్ అధ్యక్షునిగా బాలాపురం ఆనంద్ రావు, పగదల దుబ్బా అధ్యక్షునిగా గడ్డం శంకర్(రాజు), దేవీ మాత అధ్యక్షునిగా తారక్ వేణు గోపాల్, ఎల్లమ్మ దేవీ అధ్యక్షులుగా మెట్టు విజయ్ కుమార్ లను ఎన్నుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి అధ్యక్షులుగా కర్నిచంద్రకాంత్, మోపాల్ అధ్యక్షునిగా ఎన్.శశాంక్, ఇందల్వాయి అధ్యక్షునిగా లోలం సత్యనారాయణ, జక్రాన్ పల్లి అధ్యక్షునిగా కన్నెపల్లి ప్రసాద్, సిరికొండ అధ్యక్షునిగా గుర్రం సంజీవ్ రెడ్డి, ధర్పల్లి అధ్యక్షునిగా జిర్ర మహిపాల్ యాదవ్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షునిగా ముల్ల జనార్థన్ రెడ్డి,  సారంగపూర్ హనుమాన్ అధ్యక్షునిగా జంగిటి ఆనంద్ లను నియమించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ టౌన్ అధ్యక్షునిగా మందుల బాలక్రిష్ణ, ఆర్మూర్ రూరల్ అధ్యక్షునిగా సుంకరి వినోద్, మాక్లూర్ అధ్యక్షునిగా మాదరి మమత, డొంకేశ్వర్ అధ్యక్షునిగా మగ్గిడి చిన్నా రెడ్డి, ఆలూర్ అధ్యక్షునిగా సూర శ్రీకాంత్ ను నియమించారు. బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి అధ్యక్షునిగా కోల ఇంద్రకరణ్ ను నియమించారు. బాల్కొండ నియోజవర్గంలోని భీంగల్ టౌన్ అధ్యక్షునిగా కనికరం మధును నియమించారు.

More articles

Latest article