బీజేపీ మండల అధ్యక్షుల ఎన్నిక
నిజామాబాద్, బతుకమ్మ : బీజేపీ రాష్ట్ర నాయకుల ఆదేశానుసారం బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాలోని 21 మండలాలకు శుక్రవారం నూతన అధ్యక్షులను ఎన్నుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఖిల్లా రాంమందిర్ అధ్యక్షునిగా కోడురు నాగరాజు, వినాయక్ నగర్ అధ్యక్షునిగా ఇప్పకాయల కిశోర్, కంఠేశ్వర్ అధ్యక్షునిగా బాలాపురం ఆనంద్ రావు, పగదల దుబ్బా అధ్యక్షునిగా గడ్డం శంకర్(రాజు), దేవీ మాత అధ్యక్షునిగా తారక్ వేణు గోపాల్, ఎల్లమ్మ దేవీ అధ్యక్షులుగా మెట్టు...