29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంటిగ్రేటేడ్ మార్కేట్ లను పరిశీలించిన  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

Must read

📰 Generate e-Paper Clip

. . . రెండేళ్లైనా అహ్మది బజార్ మార్కేట్ ప్రారంభించిక పోవడంపై ఆరా

. . . షాపుల కేటాయింపు పారధర్శకంగా జరిగేలా చూస్తానన్న ఎమ్మెల్యే

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని అహ్మది బజార్, ఖలీల్ వాడిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ , మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు అహ్మది బజార్ లో రూ.9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు పూర్తి అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న ప్రారంభం కాకపోవడం తో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు.97 షట్టర్స్ తో నిర్మాణం అయినా మార్కెట్ నాన్ వెజ్ కు 38,జనరల్ కు 59 చొప్పున   విధివిధానాలకు లోబడి కేటాయింపులు జరుగుతాయి అని ప్రజలకు త్వరలో అందుబాటులోకి వచ్చేల చర్యలు తీసుకుంటాం అన్నారు.

Urban MLA Dhan Pal examined the integrated markets

 

ఖలీల్ వాడిలోని మల్టీపుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు రూ.4.50 కోట్ల వ్యయంతో దాదాపు పూర్తి కావడం జరిగిందని అన్నారు మిగిలిన పనులకు రూ.1.50 కోట్ల రూపాయలు మంజురు చేయడం జరిగిందన్నారు త్వరలో పనులు పూర్తి చేసేల చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు.మల్టీపుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో నాన్ వెజ్ 32,ఫ్లవర్ & ఫ్రూట్స్ 16,వెజ్ 64 స్టాల్స్ ను మున్సిపల్ విధివిధానాలకు లోబడి కేటాయింపులు జరుగుతాయి అని అన్నారు. మార్కెట్ల ప్రారంభం ఆలస్యనికి గల కారణాలు కమీషనర్ రుఅడిగి తెలుసుకున్నారు, చట్టపరమైన విధివిధానాలు పూర్తి చేసి అతి త్వరలో మార్కెట్ ప్రారంభనికి కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళి , ఆర్ అండ్  బి ఎఇ సాయి కుమార్, మున్సిపల్ సిబ్బంది, బీజేపీ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.Urban MLA Dhan Pal examined the integrated markets

More articles

Latest article